16, అక్టోబర్ 2023, సోమవారం

ప్రార్థన

 🙏నిత్య ప్రార్థన 🙏

చ. "అరయ నశాశ్వతంబగుచు

     నంత్యము లేని సుఖాళు లన్నియున్

    నిరయము వోలె నుండియును 

     నిచ్చు నశాంతిని నెల్ల వేళలన్,

    సురముని వంద్య  ! యో నిగమ

     శోభిత !  నన్నిక నుద్ధరించి నిన్

    నిరతము దల్చుకో గలుగు

     నిశ్చల భక్తిని నిమ్ము కేశవా!   🙏 


ఉ. నీ పదముల్ నిరంతరము

       నీమముతో స్మరియించు భక్తియు ,

     న్నీ పదదాసులన్ గలసి

       నెయ్యముపొందెడి నిత్యభాగ్యము ,

     న్నే పదమెల్ల యోగువరు

        లేర్పడగోరుదు రెల్లవేళల

     న్నా పద మిమ్ము నాకు హృద

        యస్థుడవై యనురక్తితో ప్రభూ !  🙏


✍️గోపాలుని మధుసూదన రావు 🙏




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి